ఏపీ లో కరెంటు బిల్లుల మోత

ఏపీ లో కరెంటు బిల్లుల మోత .కొరోనా లాక్ డోన్ అమలు అవుతున్న సమయంలో ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో బీడీలు చేసుకుంటూ ఛాన్వి అనే మహిళ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే ఆమెకి ఏకంగా రూ.41 వేల కరెంటు బిల్లు వచ్చింది. దీనితో సదరు మహిళ ఒక్కసారిగా కంగుతింది.రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, టీవీ ఉన్న ఇంటికి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలు రావడం ఏంటి అని ఆశ్చర్యపోయింది. అయితే ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు మాత్రం విద్యుత్ వినియోగించిన దానికంటే ఒక్క యూనిట్‌కి కూడా ఎక్కువ బిల్లు వేయలేదని చెబుతున్నారు. ఇలాంటి తరహా సంఘటనలు మరికొన్ని చోట్లలో కూడా చోటు చేసుకున్నాయి.

తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సమీపంలోని ఓ గ్రామంలో పూరి గుడిసెలో ఉండే ఓ కుటుంబానికి రూ.17 వేలు, మరో కాలనీలో రేకుల షెడ్డులో ఉంటున్న కుటుంబానికి రూ.28 వేల బిల్లు వచ్చింది. దీనితో వారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వేసవిలో ఫ్యాన్లు, టీవీలు,లైట్లు వాడుతున్నప్పటికి ఇంత బిల్లు రాదని వారు వాపోతున్నారు. అయినప్పటికి ఓ బంగ్లాకి రావాల్సిన బిల్లు రావడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే విద్యుత్తు అధికారులు మాత్రం మీటర్‌ రీడింగ్‌ సేకరణ, బిల్లుల తయారీలో ఎలాంటి లోపాలు లేవని, వినియోగించిన దానికే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు.

కరెంటు బిల్లుల గురించి ఏమాత్రం ఉన్నతాధికారుల్లో గాని పాలకుల్లో గాని ఒక సమీక్ష కూడా జరపకపోవడం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడింది. పాలకులు చిన్న కామన్ సెన్స్ మిస్సయ్యి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేయడమే కాదు, వారిపై తీవ్ర భారం మోపారు. తినడానికే ఇబ్బంది పడుతున్న మేము ఇంత పెద్ద బిల్లులు డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి అని ప్రశ్నిస్తున్నారు.

AP latest news, telugu news, Andhra pradesh people shock with electricity bill , telugu news update