20 లక్షల కోట్ల ప్యాకేజీని దేశానికి ప్రకటించిన మోడీ

ప్రధాని మోడీ దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయాల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జీడీపీ దాదాపు 10శాతం ఉంటుందని చెప్పారు. ఈ ఆర్ధిక ప్యాకేజీతో నిరుపేద‌లు, చిన్న, మ‌ధ్య‌ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల స‌హా ప్ర‌తి ఒక్క‌రికీ భ‌రోసానింపుతామ‌ని అన్నారు. ఈ ప్యాకేజీ వివ‌రాల‌ను రేప‌టి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి వెల్ల‌డిస్తార‌ని చెప్పారు. ప్యాకేజీలో ప్ర‌తి రూపాయి ప్ర‌జ‌ల‌కు చేరేలా చూస్తామ‌న్నారు. స్వ‌యం సాధికార‌త‌తో అంద‌రం ముందుకు న‌డిచేలా చ‌ర్య‌లు తీసుకంటామ‌న్నారు. ఈ క్రైసిస్ నుంచి మ‌నం బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లంతా ఐక్యంగా పోరాడాల‌న్నారు. సంక్షోభం నుంచి స‌రికొత్త భార‌తాన్ని నిర్మించుకోవాలి, దేశీయ, లోక‌ల్ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని సూచించారు. లోక‌ల్ గా వ‌స్తువుల ఉత్ప‌త్తి, లోక‌ల్ మార్కెట్లు, లోక‌ల్ వ‌స్తువుల కొనుగోలు వంటి వాటిపై దృష్టి పెట్టాల‌ని పిలుపునిచ్చారు.

PM modi latest news, telugu news, PM Narendra Modi announced a Rs 20 lakh crore  package for a self-reliant India, corona latest news